రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి: డిహెచ్ శ్రీనివాస్
హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా పూర్తిగా పోలేదని, రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డిహెచ్ శ్రీనివాస్ అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గ దర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కారోనా వ్యాప్తి అదుపులోనే ఉందని, పక్క రాష్ట్రాలలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. హైదరాబాద్ మినహ మరెక్కడా 10 కి పైగా కేసులు నమోదు కావడం లేదని తెలిపారు. దేశంలో కొన్ని చోట్ల ఫోర్త్‌వేవ్ ప్రాంరంభమైంది. ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విమారయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు నెలలు ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు పాటించాలని శ్రీనివాస్ అన్నారు. 2022 డిసెంబర్ నాటికి కొవిడ్ పూర్తిగా ప్లూలా మారే అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని, వయసుల వారీగా అర్హత ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవాలని డిహెచ్ వివరించారు.