హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్షం .. విమానాల దారి మళ్లింపు

హైదరాబాద్ (CLiC2NEWS) నగరంలో గురువారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది. ఎండవేడితో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు చిరుజల్లులతో ఉపశమనం లభించింది. నగరంలోని కొండాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, అబ్ధుల్లపూర్‌మెట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కూకట్ పల్లి, కెపిహెచ్‌బి కాలనీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట్, మలక్‌పేట ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉదుములతో కూడిన వర్షం కురిసింది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్హం కురిసింది. ఈదురు గాలలు బలంగా వీయడంతో శంషాబాద్ విమానాశ్రమంలో విమానాల లాండింగ్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లించారు. నాలుగు విమానాల దారి మళ్లించినట్లు సమాచారం. రెండు విమానాలను ఎపిలోని గన్నవరంకు విమానాశ్రయంకు, మరో రెండు బెంగళూరుకు మళ్లించినట్లు తెలుస్తోంది.