రంజాన్ స్పెషల్ ‘దుఆ’లు

1. ఉపవాస సంకల్ప దుఆ (నియ్యత్ )
నవైతు ఆన్ అసవ్మ గదన్ లిల్లాహి త అలా మీన్ సామి రంజాన్ (లేక) నవైతు బిసామీన్ గద్దిన్.
2. ఇఫ్తార్ సమయంలో ఈ దుఆ పటించాలి.
3. సహరి సమయంలో చేసే దుఆ.. యా వాసిఆల్ మగ్ఫిరహ్.
4. అసర్ నుండి మగ్రీబ్ వరకు చదివే దుఆ.. “యా వాసి ఆల్ ఫజ్లి ఇగ్ఫిర్లీ ”
5. మొదటి ఉపవాసం నుండి 10 వ ఉపవాసం వరకు చదివే దుఆ.. “అల్లాహుమ్మర్ హమ్నీ యా అర్హమార్రహీమిన్ ”
6. 11 నుండి 20 వ ఉపవాసమునకు చదివే దుఆ..”అల్లహుమ్మగ్ ఫిర్ లి జునూబి యా రబ్బల్ అలామీన్ ”
7. 21 నుండి చివరి ఉపవాసం వరకు చదివే దుఆ..”అల్లాహుమ్మ ఆత్ ఖిని మీనన్నారి వఅద్ ఖిల్ నీ ఫిల్ జన్నతి యా రబ్బల్ అలమీన్ ”
8. రాత్రులలో చదివే దుఆ.. “అల్లాహుమ్మ ఇన్నక అపువ్వ్వున్ తుహిబ్దుల్ ఆఫ్ వఫాజ్ పు అన్నీ యా గపూరు యాగపూరు యా గపూరు
అల్లాహ్ మార్గంలో బయలు దేరి 16 విషయాల హద్దులో ఉండాలి.
(1) నాలుగు పనులలో ఎక్కువ సమయం గడపాలి.
అల్లాహ్ వైపు ఆహ్వానించుట (daawath)లో
ధర్మ విద్య నేర్చుకోవటంలో, నేర్పించుటలో
ఆరాధన (ఇబాదాత్ లో )
తాలీంలో
(2) నాలుగు పనులలో తక్కువ సమయం తీసుకోవాలి.
ఆహారపనియాలు సేవించుటలో
స్నానం, బట్టలు ఉతుకాట వగైరాలో
నిద్రించుటలో
సహజ అవసరాలలో
(3) నాలుగు పనులు అసలు చేయకూడదు.
వృధా మాటలు
వృధా ఖర్చులు
మనసుతో కానీ నోటితో కానీ యాచించుట
అనుమతి లేనిదే తోటి వారెవరి ఏ వస్తువు కూడా తీసుకోకూడదు
(4) సేవకి సంబందించిన 4 పనులు చేయవలెను.
స్వయం సేవ
తోటి వారి సేవ
స్థానికుల ఊరివారి సేవ
అమీర్ యొక్క సేవ
(అనగా అమీర్ యొక్క మాట వినాలి ).
షేక్. బహార్ అలీ
ఖమ్మం.