‘నా స్నేహితుడితో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నాను’.. బోరిస్ జాన్సన్
ప్రపంచంలో నేనెక్కడా దీనిని పొందలేకపోవచ్చేమో
ఢిల్లి (CLiC2NEWS): భారత ప్రభుత్వం నుండి లభించిన ఆహ్వానంపై బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలపారు. నేను ఇంతటి సంతోషకరమైన ఆహ్వానాన్ని ఎప్పుడూ చేడలేదని,’ప్రపంచంలో నేను ఎక్కడా దీనిని పొందలేకపోవచ్చేమో’.. అంటూ జాన్సన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
బ్రిటన్ ప్రధాని రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద ఆయనకు ప్రధాని నరేంద్రమోడి ఆహ్వానం పలికారు. ఆయనకు అక్కడ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఈరోజు మోడీని కలవడానికి ముందు “నా స్నేహితుడితో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నాను” అంటూ బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు.
ఇండో- ఫసిఫిక్ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడం, ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్ధిక భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరుదేశాల ప్రధానులు చర్చించనున్నారు. అదేవిధంగా విదేశాంగ మంత్రి జైశంకర్, జాన్సన్ మధ్య చర్చలు కొనసాగునున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్లో మీడియా ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.
Wonderful to see you, my friend PM @BorisJohnson in India on a long-awaited visit. Look forward to our discussions today. https://t.co/6gUxR1PwPH pic.twitter.com/z6Ufv8zgAb
— Narendra Modi (@narendramodi) April 22, 2022