ts: నాలుగు రోజులపాటు వానలు

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా ఎండవేడి, ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఊరటనిచ్చే వార్త. తెలంగాణలో నాలుగు రోజులపాలు వర్షాలు కురిసే అవకాశముంది.
కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో.. ఈ నెల 25 వరకు దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని వాతావరణ శాఖ అదికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయని అధికారులు పేర్కొన్నారు. నిన్న గురువారం సాయంత్రం పలుచోట్ల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.