గోడను బద్దలుకొడితే.. నోట్ల కట్టలు, వెండి ఇటుకలు
ముంబయి (CLiC2NEWS): ఎక్కడైనా గోడను బద్దలుకొడితే ఇటుకలు బయటపడతాయి. కానీ ముంబయిలోని ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడలను, నేలను అధికారులు తవ్వి చూడగా భారీగా నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. కల్బాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచిన సుమారు. రూ. 10 కోట్ల విలువగల సొత్తును అధికారులు గుర్తించారు. దీనిలో రూ. 9.8 కోట్ల నగదు కట్టలు, రూ. 13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల మహారాష్ట్ర జిఎస్టి అధికారులు అనుమానిత కంపెనీల లావాదేవీలను పరిశీలించగా.. చాముండా బులియన్ టర్నోవర్ గత మూడేళ్లలో రూ. 23 లక్షల నుంచి రూ. 1,764 కోట్లకు పెరగడాన్ఇన గుర్తించారు. దీంతీ కల్బాదేవి సహా మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. మొదటగా కాల్బాదేవిలో 35 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయంలో ఏమీ లభించలేదు. తర్వాత గదిలో నేలపై ఏర్పాటు చేసిన ఫలకలను (టైల్స్) పరశీలించగా.. కొంచెం భిన్నంగా ఉండటంతో ఫలకలను తొలగించి చూశారు. నగదు కుక్కిన గోనె సంచులు బయటపడ్డాయి. ఆదాయపు పన్ను అధికారలకు సమాచారం అందించగా.. వారు గోడలో ఉన్న రహస్య అరను గుర్తించారు. వాటినుండి నగదు నింపిన గోనె సంచులు, వెండి ఇటుకలు సైతం లభించాయి.