విధుల స‌మ‌యంలో ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు..

క‌రీంన‌గ‌ర్‌ (CLiC2NEWS): ప్ర‌భుత్వ వైద్యులు విధులు నిర్వ‌హించే స‌మ‌యంలో ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్తు (TVVP) క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ అజ‌య్‌కుమార్ అన్నారు. ఆయ‌న క‌రీంన‌గ‌ర్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఆసుప‌త్రిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. క్యాజువాలిటి, ఓపి బ్లాక్‌ల‌ను ప‌రిశీలించ‌గా.. అక్క‌డ వైద్యులు లేక‌పోవ‌డంతో హాజ‌రు రిజిస్ట‌ర్ చూశారు. 12 మంది వైద్యులు విధుల‌కు హాజ‌రు కాలేద‌ని గుర్తించి వారంద‌రికీ అప్ప‌టిక‌ప్పుడే మెమోలు జారీ చేశారు. ఆస్ప‌త్రిలోనివార్డుల‌ను తిరిగి రోగుల‌కు అందుతున్న‌వైద్య సేవ‌ల‌పై అడిగి తెలుసుకున్నారు. రోగి కేర్ షీట్‌ను ప‌రిశీలించ‌గా అందులో హైరిస్క్‌ అని రాసి ఉండ‌గా ఇదేమిట‌ని ప్ర‌శ్నించారు. ఇలా ప్ర‌తి కేసుపై హైరిస్క్ అని రాసి రిఫ‌ర్ చేసి చేతులు దులుపుకోవద్ద‌న్నారు. ఉద‌యం 9 గంట‌ల‌నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఓపి సేవ‌లు కొన‌సాటించాల‌ని, ఈ స‌మ‌యంలో ఎవ‌రైనా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినా, విధుల‌కు ఆల‌స్యంగా వ‌చ్చినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.