ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే.. సినిమా ఇంకా మిగిలే ఉంది: నితిన్ గ‌డ్క‌రి

తెలంగాణ ప్ర‌గ‌తిశీల సంప‌న్న రాజ్యం

హైద‌రాబాద్ (CLiC2NEWS): కేంద్ర రోడ్డు ర‌వాణ‌, ర‌హ‌దారుల శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్క‌రి శంషాబాద్‌లో హైవేల విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాల‌కు జాతీయ ర‌హ‌దారుల ఈనుసంధానం జ‌రిగింది. హైద‌రాబాద్ రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు డిపిఆర్ పూర్త‌య్యింద‌ని తెలిపారు. ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే.. సినిమా ఇంకా మిగిలే ఉంది. హైద‌రాబాద్ రీజ‌న‌ల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాప‌న చేయ‌టానికి మూడు నెలల్లో వ‌స్తా. తెలంగాణ అభివృద్ది చెందితే.. భార‌తదేశం అభివృద్ది సాధించిన‌ట్లే. రింగ్ రోడ్డు కోసం భూసేక‌ర‌ణ త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని ప్ర‌భుత్వానికి సూచిస్తున్నా, నేష‌న‌ల్ హైవేల వెంట లాజిస్టిక్స్ పార్కులు నిర్మించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నానని మంత్రి అన్నారు. తెలంగాన‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు తాగునీటి స‌మ‌స్య తీరింది. భార‌త‌దేశ అభివృద్ధిలో హైద‌రాబాద్ కీల‌కంగా ఉంద‌ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.