సిఎం కెసిఆర్ తో ఎపి మంత్రి రోజా భేటీ

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆర్కే రోజా తొలిసారిగా సిఎం కెసిఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సిఎం కెసిఆర్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎపి నూత‌న మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన రోజాకు.. కెసిఆర్ పుష్ప‌గుచ్చం అందించి అభినంద‌న‌లు తెలిపారు. ఆర్కే రోజా ఎపి నూత‌న మంత్రివ‌ర్గంలో ఎపి ప‌ర్యాట‌క‌, క్రీడ‌లు, యువ‌జ‌న శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌తలు చేప‌ట్టిన వియ‌షం తెలిసిదే.

ఎపిలో ప‌రిస్థితిపై తెలంగాణ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి రోజా ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ద్ద మీడియాతో మాట్లాడారు.. ఎపి విష‌యంలో కెటిఆర్‌ను ఎవ‌రో త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని అన్నారు. మంత్రి కెటిఆర్‌ పొరుగు రాష్ట్రాలు అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన‌లేద‌ని రోజా స్ప‌ష్టం చేశారు. ఒక వేళ ఎపి గురించి అని ఉంటే తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా కెటిఆర్‌ను ఎపికి సాద‌రంగా ఆహ్వానిస్తున్నాని.. ఆయ‌న‌కు చెప్పిన ఫ్రెండ్ కూడా వ‌స్తే ఇద్ద‌రికీ ఎపిలో జ‌రుగుతున్న అభివృద్ధిని దగ్గ‌రుండి చూపిస్తాన‌ని మంత్రి రోజా మీడియాకు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.