భార‌త విద్యార్థులు తిరిగి చైనాకు రావొచ్చు..

కొవిడ్ కార‌ణంగా చైనా నుండి అనేక మంది భార‌త విద్యార్థులు స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చారు. అప్ప‌టినుండి వారంతా భార‌త్‌లోనే ఉండిపోయారు. అయితే.. వారంతా తిరిగి చైనాకు వ‌చ్చి చ‌దువులు కొన‌సాగించేందుకు వీలుగా ప్ర‌క్రియ మొద‌లుపెట్టిన‌ట్లు చైనా విదేశాంగ శాఖ శుక్ర‌వారం వెల్ల‌డించింది.

“చ‌దువులు కొన‌సాగించేందుకు చైనా తిరిగి రావాల‌నుకునే భార‌త విద్యార్థుల‌కు మేం అధిక ప్రాధాన్య‌మిస్తున్నాం. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, చైనా తితిగొచ్చిన ఇత‌ర దేశాల విద్యార్థులు అనుభ‌వాల‌ను మేం భార‌త అధికారుల‌కు తెలియ‌జేశాం. భార‌త విద్యార్థులు తిరిగొచ్చేందుకు వీలైన‌ప్ర‌క్రియ‌ను ప్రారంభించాం. మా దేశానికి రావాల‌నుకునే విద్యార్థుల జాబితాను అధికారులు అందించాల్సి ఉంది”. అని చైనా విదేశింగ శాఖ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

చైనా ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో బీజింగ్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం చ‌ర్య‌లు చేప‌ట్టింది. చైనాకు తిరిగి వెళ్లాల‌నుకొనే విద్యార్థులు మే 8వ తేదీలోగా త‌మ పేర్ల‌నున‌మోదు చేసుకోవాల‌ని సూచించింది. ఈ జాబితాను చైనా స‌ర్కారుకు అందించిన త‌ర్వాత‌.. ఎవ‌రెవ‌రు చైనా వ‌చ్చి త‌మ కోర్సులు పూర్తి చేయాలో బీజింగ్ నిర్ణ‌యించ‌నుంద‌ని భార‌త ఎంబ‌సీ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.