ఉద్యోగార్థులకు టిఎస్ఆర్టీసీ శుభవార్త..
బస్‌పాస్‌లపై 20% డిస్కౌంట్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అనేక మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణాల నుండి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకొనేందుకు వచ్చే అభ్యర్థులకు బస్ పాస్‌లలో 20% రాయితీ కల్పిస్తూ టిఎస్ ఆర్టీసీ ప్రకటన జారీ చేసింది. ఉద్యోగార్థులకు జిబిటి ఆర్టీసీ, జిబిటి మెట్రో ఎక్స్‌ప్రెస్ పాసులపై ఆర్టీసీ రాయితీ ప్రకటించింది.
మూడు నెలలకు గాను ప్రస్తుతం ఆర్డినరీ బస్‌పాస్‌లకు రూ. 3,450 వసూలు చేస్తున్నారు. 20% తగ్గించిన తర్వాత రౌండప్ చేసి రూ. 2,800 వసూలు చేయనున్నారు. ఆదేవిధంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతం రూ. 3,900 వసూలు చేస్తున్నారు. 20% తగ్గించి రూ. 3,200 వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.
శనివారం నుండి హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని అన్ని బస్‌పాస్ కేంద్రాల్లో ఈ పాస్‌లు తీసుకోవచ్చు అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ పాస్ పొందాలనుకునే వారు ఆధార్ కార్డు, అన్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, కోచింగ్ సెంటర్ ఐడి కార్డును జతచేయాల్సి ఉంటుంది.
TSRTC is happy to announce 2 new bus passes for the unemployed youth attending training classes for competitive exams in #Telangana with a discount of 20%. #TSRTC wishes you all the very best and bright future ahead @TSRTCHQ @baraju_SuperHit @TV9Telugu @sakshinews#TSRTCNewPass pic.twitter.com/DQUfiRmlpl
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 30, 2022