హైదరాబాద్లో రోడ్లన్నీ జలమయం..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో రాష్ట్రంలో వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. మఖ్యంగా పాతబస్తీలో వరదనీరు భారీగా చేరి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు పొంగి పొర్లుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలో నీరు పొంగి పొర్లుతుండటంతో జిహెచ్ఎంసి సిబ్బంది పూడిక తీత పనులు చేపట్టారు.