శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా..
కొలంబొ (CLiC2NEWS): శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రతిపక్షాలు, ప్రజల నిరసనల కారణంగా సోమవారం మహింద రాజపక్స రాజీనామా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులు, ప్రభుత్వ మద్దతు దారులు దాడులకు యత్నించడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణ వల్ల దేశ రాజధాని కొలంబొలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో
రాజీనామా ప్రకటన వెలువడింది.
ఇటీవల శ్రీలంక అధ్యక్షడు గొటబయ ప్రధాని రాజపక్స నివాసంలో జరిగిన ప్రత్యే కేబినెట్ సమావేశంలో ప్రధాని రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చారు. దేశంలో కొనసాగుతున్న సంక్షోభానికి తన రాజీనామా ఒక్కటే పరిష్కారం అయితే.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.