హైద‌రాబాద్‌లో చ‌ల్ల‌బ‌డిన వాతావ‌ర‌ణం

హైద‌రాబాద్ (CLiC2NEWS): అస‌ని తుఫాన్ ప్ర‌భావంతో తెలంగాణలో వాతావ‌ర‌ణం మేఘావృత‌మై ఉంది. రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఇవాళ ఉద‌యం నుంచి అక్క‌డ‌క్క‌డ చిరు జ‌ల్లులు కురిశాయి. ఆకాశ‌మంతా మేఘ‌వృత‌మై ఉంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టంతో హైద‌రాబాద్ వాసులకు ఎండ నుంచి కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్ల‌యింది.

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఈ తుఫాన్ బ‌ల‌హీన ప‌డింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో తెలంగాణ‌లోని మంచిర్యాల‌, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్‌, ములు, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారి శ్రావ‌ణి తెలిపారు.

వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో 30 నుంచి 40 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయ‌ని అధికారులు హెచ్చ‌రించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. కాగా మ‌హారాష్ట్రలోని విద్ర్భ ప్రాంతంపై 1500 మీ. ఎత్తున గాలుల‌తో ఊప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది.

Leave A Reply

Your email address will not be published.