శ్రీ‌లంక నూత‌న ప్ర‌ధానిగా ర‌ణిల్ విక్ర‌మ సింఘే ప్ర‌మాణ స్వీకారం

కొలంబొ (CLiC2NEWS): శ్రీ‌లంక నూత‌న ప్ర‌ధానమంత్రిగా ర‌ణిల్ విక్ర‌మ సింఘే బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆందోళ‌న‌తో అట్టుడుకుతున్న శ్రీ‌లంక‌లో ప్ర‌ధాన‌మంత్రి మ‌హింద రాజ‌ప‌క్స రాజీనామా చేసిన విష‌యం తెలిసిన‌దే. గురువారం సాయంత్రం అధ్య‌క్ష భ‌వ‌నంలో అధ్యక్షుడు గొట‌బాయ‌ విక్ర‌మ సింఘేతో ప్ర‌మాణం చేయించారు.

దేశాన్ని సంక్షోబాల నుండి గ‌ట్టెక్కించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న అధ్యక్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స బుధ‌వారం దేశ ప్ర‌జ‌లనుద్దేశించి ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో పార్ట‌మెంట్‌లో మెజార్టీ, ప్ర‌జ‌ల విశ్వాసం పొందిన కొత్త ప్ర‌ధాని పేరును ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు. మాజీ ప్ర‌ధాని విక్ర‌మ సింఘేతో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం దేశ ప్ర‌ధానిగా సింఘేను నియ‌మించ‌డానికి మొగ్గుచూపారు. అదేవిధంగా కొత్త మంత్రివ‌ర్గంలో త‌మ కుటుంబీకులెవ‌రూ ఉండ‌బోర‌ని హామీ ఇచ్చారు.

శ్రీ‌లంక ప్ర‌ధాని మ‌హింద రాజ‌ప‌క్స రాజీనామా..

Leave A Reply

Your email address will not be published.