ఆయిల్ ట్యాంక‌ర్‌లో 15 కిలోల‌ బంగారం ప‌ట్టివేత‌

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త్-మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న 15.93 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 8 కోట్ల‌కు పైనే ఉంటుందని తెలిపారు. ‘గోల్డ్ ఆన్ ది హైవే’ అనే పేరుతో చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌లో భాగంగా డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు మ‌ణిపూర్‌లోని మావూ నుంచి అస్సాంలోని గౌహ‌టి వ‌ర‌కు వేర్వేరుగా ప్ర‌యాణం చేస్తున్న రెండు ఆయిల్ ట్యాంక‌ర్లు, ఒక ట్ర‌క్కుపై నిఘా వేసి ప‌ట్టుకున్నారు. ఆయా వాహ‌నాల్లో వివిధ భాగాల్లో దాచి ఉంచిన మొత్తం 96 గోల్డ్ బిస్కెట్లు (దాదాపు 8.38 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8 కోట్లు ఉంటుంద‌ని అంచానా. గ‌త ఆర్ధిక సంవ‌త్స‌రంలో దేశ వ్యాప్తంగా డిఆర్ ఐ అధికారులు రూ. 405 కోట్లు విలువ చేసే 833 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.