తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉజ్జ‌ల్ భూయాన్‌!

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలోని ఐదు రాష్ట్రాలకు కొత్త ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల నియ‌మానికి సుప్రీకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేర‌కు తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉజ్జ‌ల్ భూయాన్ నియ‌మితుల‌య్యారు. తెలంగాణ హైకోర్టు సిజేగా ఉన్న జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌ను బ‌దిలీ చేసి ఆయ‌న స్థానంలో న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌కు ప‌దోన్న‌తి క‌ల్పించి సిజెగా నియ‌మించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార‌సు చేసింది. జ‌స్టిస్ స‌తీష్ చంద్రశ‌ర్మ‌ను ఢిల్లీ హైకోర్టుకు బ‌దిలీ చేయ‌నున్నారు.

తెలంగాణ‌తో పాటు ఉత్త‌రాఖండ్‌, హిమాచల్ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, గువాహ‌టి రాష్ట్రాల కు కొత్త ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించ‌నున్నారు.

  • ఉత్త‌రాఖండ్ హైకోర్టు ఛీఫ్ జ‌స్టిస్ గా విపిన్ సింగి
  • హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు ఛీఫ్ జ‌స్టిస్ గా అంజాద్ స‌యీద్‌
  • రాజ‌స్థాన్ హైకోర్టు ఛీఫ్ జ‌స్టిస్ గా ఎస్‌. ఎస్‌. షిండే
  • గుజ‌రాత్ హైకోర్టు హైకోర్టు ఛీఫ్ జ‌స్టిస్ గా రాష్మిన్ ఛాయ‌
Leave A Reply

Your email address will not be published.