9,168 గ్రూప్-4 పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై సిఎస్ స‌మీక్ష‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో గ్రూప్‌-4 విభాగంలో 9,165 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కెసిఆర్ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకు అనుగుణంగా గ్రూప్‌-4 నోటిఫికేష‌న్‌పై టిఎస్‌పిఎస్‌సి ఛైర్మ‌న్ జ‌నార్థ‌న్ రెడ్డి, అధికారులు, సంబంధిత శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సిఎస్ సోమేశ్‌కుమార్ స‌మీక్ష నిర్వ‌హించారు. 2018 నూత‌న రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులకు లోబ‌డి 95% ఉద్యోగాలు స్థానికుల‌కే ద‌క్కుతాయ‌ని సిఎస్ తెలిపారు.

రాష్ట్రంలో గ్రూప్‌-1, పోలీసు ఉద్యోఓగాల‌కు నోటిఫికేష‌న్లు ఇచ్చిన ప్ర‌భుత్వం తాజ‌గా గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై దృష్టి సారించింది. గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు సంబంధించి రోస్ట‌ర్ పాయింట్లు స‌హా అవ‌స‌ర‌మైన వివ‌రాలు, స‌మాచారాన్ని ఈ నెల 29వ తేదీలోపు టిఎస్‌పిఎస్‌సికి అందించాల‌ని అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌కు సిఎస్ ఆదేశించారు. జూనియ‌ర్ అసిస్టెంట్‌, స‌మాన స్థాయి పోస్టుల ఖాళీల‌న్నింటినీ నోటిఫికేష‌న్‌లో చేర్చాల‌ని, ప‌దోన్న‌తుల ద్వారా వ‌చ్చే ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేయాల‌ని చెప్పారు. ఈ ప్ర‌క్రియ పూర్త‌వ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకోకుండా అన్ని శాఖ‌ల అధిప‌తులు ప్ర‌త్యేక దృష్టి సారించి పోస్టుల భ‌ర్తీకి త్వార‌గా ఆర్ధిక శాఖ నుండి అనుమ‌తి తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Leave A Reply

Your email address will not be published.