దిశ కేసు నివేదిక బ‌ట్ట‌బ‌య‌లు.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు..

దిశ కేసు నిందితుల ఎన్ కౌంట‌ర్ బూట‌కం: సుప్రీం కోర్టుకు సిర్పూర్క‌ర్ క‌మిష‌న్ నివేదిక‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంట‌ర్ బూట‌క‌మ‌ని జ‌స్టిస్ వి.ఎస్‌. సిర్పూర్క‌ర్ క‌మిష‌న్ తేల్చింది. ఈ మేర‌కు 387 పేజీల నివేదిక‌ను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రింకోర్టుకు స‌మ‌ర్పించింది. సిర్పూర్క‌ర్ క‌మిష‌న్ నివేదిక ద్వారా షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ఈ కేసులో పోలీసుల‌పై హత్యానేరం కింద విచార‌ణ జ‌ర‌పాల‌ని క‌మిష‌న్ అభిప్రాయ‌ప‌డింది. నిందితులు ఎదురుకాల్పుల్లో మ‌ర‌ణించార‌న్న పోలీసుల వాద‌న న‌మ్మ‌శ‌క్యంగా లేదంటూ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించిన నివేదిక‌లో క‌మిష‌న్ పేర్కొంది.

10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న‌లో పాల్గొన్నార‌ని, వీరంద‌రిపై హ‌త్యానేరం కింద కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌ర‌పాల‌ని క‌మిష‌న్ పేర్కొంది. పోలీసు అధికారులు సురేంద‌ర్‌, న‌ర‌సింహారెడ్డి, లాల్ మ‌దార్‌, సిరాజుద్దీన్‌, ర‌వి, వెంక‌టేవ్వ‌ర్లు, అర‌వింద్ గౌడ్‌, జాన‌కీరామ్‌, బాలు రాథోడ్‌, శ్రీ‌కాంత్ పై విచార‌ణ జ‌ర‌పాల‌ని క‌మిష‌న్ సూచించింది. ఈ ప‌ది మంది పోలీసుల‌పై ఐపిసి 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్ష‌న్ల కింద విచార‌ణ జ‌ర‌పాల‌ని నివేదిక‌లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.