339 పోస్టుల భ‌ర్తీ.. యుపిఎస్‌సి-సిడిఎస్‌ (2) 2022 నోటిఫికేష‌న్‌

ఢిల్లీ (CLiC2NEWS): యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC).. కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (CDS) (2) 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల‌లైంది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. జూన్ 7 వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. సెప్టెంబ‌ర్ 4వ తేదీన ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

మొత్తం ఖ‌ళీలు : 339

ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మి, డెహ్రాడూన్‌-100,

ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మి, ఎజిమ‌ళ‌-22,

ఏర్‌ఫోర్స్ అకాడ‌మి, హైద‌రాబాద్‌-32,

ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మి, చెన్నై-169

ఎస్ ఎస్ సి ఉమెన్ (నాన్ టెక్నిక‌ల్) -16

అర్హ‌త : ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మి, ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మి పోస్టుల‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త .

ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మి పోస్టుల‌కు ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి

ఎయ‌ర్‌ఫోర్స్ అకాడ‌మీ పోస్టుల‌కు ఫిజిక్స్‌, మ్యాథ‌మ్య‌టిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త లేదా ఇంజినీరింగ్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించాలి.

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఎస్ ఎస్ బి ఇంట‌ర్వ్యూ, మొడిక‌ల్ టెస్ట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు www.upsc.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

 

Leave A Reply

Your email address will not be published.