రెండు మూడు నెల‌ల్లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న: సిఎం కెసిఆర్‌

బెంగ‌ళూరు (CLiC2NEWS): స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్నా ఇప్ప‌టికీ దేశంలో మంచినీరు, విద్యుత్‌, సాగునీటి కోసం ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని సిఎం కెసిఆర్ అన్నారు. కెసిఆర్ బెంగుళూరు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మాజీ ప్ర‌ధాన‌మంత్రి దేవెగౌడ‌, ఆయ‌న త‌న‌యుడు, మాజీ సిఎం కుమార‌స్వామితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా దేశంలో నెల‌కొన్న ప్ర‌స్తు పరిస్థితుల‌తో పాటు రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం కుమార‌స్వామితో క‌ల‌సి కెసిఆర్ మీడియాతో మాట్లాడారు.

దేశంలో మార్పు త‌థ్య‌మ‌ని.. రెండు మూడు నెల‌ల్లో సంచ‌ల‌న వార్త వింటార‌ని కెసిఆర్ అన్నారు. జాతీయ స్థాయిలో మార్పు వ‌చ్చి తీరుతుంద‌ని.. దీన్ని ఎవ‌రూ ఆప‌లేర‌నిఅన్నారు. కాంగ్రెస్‌, బిజెపి పాల‌న‌తో ఎవ‌రూ సంతోషంగా లేర‌ని.. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా రూపాయి విలువ ప‌డిపోయంద‌న్నారు. జిడిపిలో భార‌త్‌ను చైనా అధిగ‌మించింద‌న్నారు. సంక‌ల్ప‌ముంటే అమెరికా కంటే బ‌ల‌మైన ఆర్ధిక‌శ‌క్తిగా భార‌త్‌ను తీర్చిదిద్దొచ్చాని చెప్పారు. ఉజ్వ‌ల భార‌త్ కోసం ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కెసిఆర్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.