22 మంది ప్రయాణిస్తున్న విమానం ఆచూకీ గల్లంతు..
కాఠ్మాండు (CLiC2NEWS): నేపాల్‌లో 22 మందితో ప్రాయాణిస్తున్న విమానం గల్లంతైంది. తారా ఎయర్‌లైన్స్ 9 ఎన్ఎఈటి ట్విన్ ఇంజిన్ విమానం ఈ ఉదయం పొఖారా నుంచి జామ్ సోమ్‌కు బయలుదేరింది. 9.55 సమయంలో ఎటిసితో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. విమానాన్ని ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో తొలుత గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత మౌంట్ ధౌలగిరి వైపు మళ్లిందని అధికారులు పేర్కొంటున్నారు. దీని ఆచూకీ గుర్తించడానికి ఇతర విమానాలను ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు. విమాన ఆచూకీని కనుక్కోడానికి ఎంఐ-17 హెలికాప్టర్‌ను పంపామని ఆర్మీ అధికార ప్రతినిధది నారాయణ్ సిల్వాల్ వెల్లడించారు.
కాగా గల్లంతైన విమానంలో నలుగురు భారతీయులు ఉన్నారు. అశోక్ కుమర్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠీలుగా గుర్తించారు. వీరి కుటుంబాలకు సమాచారం అందించినట్లు నేపాల్‌లోని భారత రాయభార కార్యాలయం అధికారులు తెలిపారు.