ఏ ఎయిర్‌లైన్స్‌కూ ఆ అధికారం లేదు: డిజిసిఎ

ఢిల్లీ (CLiC2NEWS): వైక‌ల్యం ఉన్న వ్య‌క్తి ప్ర‌యాణించ‌కుండా ఆపే అధికారం ఏ విమాన‌యాన సంస్థ‌కూ లేద‌ని డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌ (DGCA) స్ప‌ష్టం చేసింది. ప్ర‌త్యేక అవ‌స‌రాలు క‌లిగిన ఓ చిన్నారిని ఇటీవ‌ల విమానంలోకి అనుమ‌తించ‌ని విష‌యం తెలిసిన‌దే. ఈ ఘ‌ట‌న‌కు ఇండిగో విమాన‌యాన సంస్థ‌పై రూ.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది డిజిసిఎ. ఈ ఘ‌ట‌పై తాజాగా స్పందిస్తూ.. వైక‌ల్యాన్ని కారణంగా చూపుతూ ఓ వ్య‌క్తి ప్ర‌యాణాన్ని ఏ ఎయిర్‌లైన్స్ కూడా తిర‌స్క‌రించ‌కూడ‌దు. విమానంలో అలాంటి ప్ర‌యాణికుడి ఆరోగ్యం క్షీణించ‌వ‌చ్చ‌ని ఎయిర్‌లైన్స్ భావిస్తే.. స‌ద‌రు ప్ర‌యాణికుడికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. అత‌డు విమానంలో ప్ర‌యాణించ‌వ‌చ్చా.. లేదా? అనే విష‌యాన్ని వైద్యులు ధ్రువీక‌రిస్తారు. దాని ద్వారానే ఎయిర్‌లైన్స్ నిర్ణ‌యం తీసుకోవాలి అని డిజిసిఎ స్ప‌ష్టం చేసింది.

మే 7వ తేదీన హైద‌రాబాద్ వెళ్లేందుకు దివ్యాంగ బాలుడితో క‌లిసి ఓ కుటుంబం రాంచీ మిమానాశ్ర‌యానికి వెళ్ల‌గా.. అత‌ను విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాక‌రించారు. చిన్నారి భ‌యాందోళ‌న‌తో ఉన్నాడ‌ని, దానివ‌ల్ల ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.