య‌మునోత్రి వ‌ద్ద బ‌స్సు ప్ర‌మాదం.. 17 మంది యాత్రికులు మృతి..

డెహ్రాడూన్ (CLiC2NEWS): ఉత్త‌రాఖండ్‌లో ఘోర ప్ర‌మాదం జరిగింది. య‌మునోత్రి జాతీయ ర‌హ‌దారిలో యాత్రికుల‌తో వెళుతున్న బ‌స్సు లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 17 మంది యాత్రికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది యాత్రికులు ఉన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డిఆర్ ఎఫ్ బృందాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన యాత్రికులు య‌మునోత్రికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం సంభ‌వించింది.

 

Leave A Reply

Your email address will not be published.