ప్ర‌భుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం..!

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

హైద‌రాబాద్ (CLIC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించే దిశ‌గా కృషి చేస్తోంది. తాజ‌గా వైద్యారోగ్య శాఖ‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియ‌మితుల‌య్యే వైద్యుల‌కు ప్రైవేట్ ప్రాక్టీసును ర‌ద్దు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. నాన్ టీచింగ్ విభాగం నుండి టీచింగ్ విభాగంలోకి బ‌దిలీ ద్వారా వ‌చ్చేవారు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈమేర‌కు స‌ర్వీస్ రూల్స్‌లో ప్ర‌భుత్వం మార్పులు చేసి మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.