అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

చింతూరు (CLiC2NEWS): అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో ప్రైవేటు బ‌స్సు బోల్తాప‌డి ఐదుగురు మృతి చెందారు. చింతూరు మండ‌లం ఏడుగురాళ్ల‌ప‌ల్లి వ‌ద్ద సంగీత ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డికక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ఇద్ద‌రు ఆసుప‌త్రిలో మృతి చెందారు. మ‌ర‌ణించిన వారిలో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. గాయ‌ప‌డిన వారిని భ‌ద్రాచలం ప్ర‌భుత్వాస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశాలోని చిన్న‌ప‌ల్లి నుండి విజ‌య‌వాడ‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదానికి గురైన‌ట్లు తెలుస్తోంది. మ‌ర‌ణించిన వారంతా ఒడిశా వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.