ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి మ‌రిన్ని వైద్య చికిత్స‌లు

ప్ర‌స‌వం ఏదైనా త‌ల్లికి రూ. 5వేలు చెల్లించాలి.

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైద్యారోగ్య‌శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో కొవిడ్ ప‌రిస్థితులు, ఆరోగ్య‌శ్రీ, దానికింద కార్య క్ర‌మాలు, వైద్యారోగ్య‌శాఖ‌లో నాడు-నేడు కింద చేప‌డుతున్న ప‌నులు, కొత్త మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం, క్యాన్స‌ర్ కేర్ త‌దిత‌ర అంశాల‌పై కీల‌క ఆదేశాలు జారీ చేశారు. నార్మ‌ల్ లేదా సిజేరియ‌న్ డెలివ‌రీ అయినా స‌రే త‌ల్లికి రూ. 5వేలు ఇవ్వాల‌ని సిఎం ఆదేశించారు.

కొవిడ్ ప‌రిస్థితుల‌న్నీ పూర్తిగా నియంత్ర‌ణ‌లో ఉన్నాయ‌ని అధికారులు తెలుప‌గా.. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సిఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఆరోగ్య‌శ్రీ కార్య‌క‌లాపాల కోసం సంవ‌త్స‌రానికి దాదాపు రూ. 4వే కోట్లు ఖ‌ర్చుచేస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. ఆరోగ్య‌శ్రీ‌లో 2,446 ప్రొసీజ‌ర్లు క‌వ‌ర్ అవుతున్నాయ‌ని అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలో దీనిపై నిరంత‌ర అధ్య‌య‌నం చేయాల‌ని, అవ‌స‌రాల మేర‌కు మ‌రింత మంచి చేయ‌డానికి ప్రొసీజ‌ర్ల సంఖ్యను పెంచాల‌ని సిఎం ఆదేశించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.