వంద శాతం భూ సమస్యలు పరిష్కరిస్తాం: హరీశ్‌రావు

సిద్దిపేట (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై ములుగులోని ఫారెస్ట్ కళాశాలలో సిఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత అధికారులతో సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వంద శాతం భూ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి ప్రత్యేక పోర్టల్ పెట్టాలని సిఎం ఆదేశించారని, దానిలో భాగంగా ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని పేర్కొన్నారు. కోర్టు కేసులు, కుటుంబ తగాదాలతో కొన్ని భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరించి రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తామని అన్నారు. ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చేపసడుతామని మంత్రి స్పష్టం చేశారు.