‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్.. ప్రతి సీనూ అద్భుతమే!

ముంబయి (CLiC2NEWS): బాలీవుడ్ యువజంట రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. వివిధ అస్త్రాల విశిష్టతను తెలియజేసే కథాంశంతో రూపుదిద్దుకున్న బ్రహ్మాస్త్ర ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం.. పార్ట్-1 శివ’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం ట్రైలర్‌ని విడుదల చేసింది.
నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. అంటూ.. మెగస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.