Major Movie: పాఠ‌శాల‌ల‌కు స్పెష‌ల్ ఆఫ‌ర్‌!

హైదరాబాద్ (CLiC2NEWS): మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం’ ‘మేజ‌ర్‌’. ఈ సిన‌మా జూన్ 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై విజ‌యం సాధించింది. తాజాగా మేజ‌ర్ చిత్ర బృందం పాఠ‌శాల విద్యార్థుల‌కు  ఓ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మేజ‌ర్ ‘సందీప్ ఉన్ని కృష్ణ‌న్’ జీవితం గురించి ప్ర‌తి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల‌నే ఉద్దేశంతో పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాల‌కు టికెట్ ధ‌ర‌పై 50% రాయితీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. పాఠ‌శాల యాజ‌మాన్యాలు ప్ర‌త్యేక షో కోసం majorscreening@gmail.com కి మెయిల్ చేసి, ఈ అవ‌కాశాన్ని స‌ద్వానియోగం చేసుకోవ‌చ్చ‌ని చిత్ర టీమ్ తెలిపింది. ఈ మేర‌కు హీరో అడివి శేషు ఓ వీడియో విడుద‌ల చేశారు.

అడ‌వి శేషు మాట్లాడుతూ.. మేజ‌ర్ చిత్రానికి భారీ విజ‌యం అందించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు . కొన్ని రోజులుగా చాలా మంది చిన్నారులు నాకు ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారు. మేమూ మేజ‌ర్ సందీప్‌లా దేశం కోసం పోరాడ‌తామ‌ని వారు చెప్ప‌డం చాలా సంతోషాన్నిచ్చింది. ఈసినిమా పిల్ల‌ల‌కు ఇంత బాగా న‌చ్చుతుంద‌ని అనుకోలేదు. ఈ స్పంద‌న చూసి మేం ఓ నిర్ణ‌యం తీసుకున్నాము. ఇంకొంత మంది పిల్ల‌లు మేజ‌ర్ గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందాల‌ని, గ్రూప్ టికెట్ల‌పై పాఠ‌శాల‌ల‌కు రాయితీ క‌ల్పిస్తున్నాం. రేప‌టి త‌రానికి మేజ‌ర్ సందీప్ గురించి తెలియాల‌నేదే మాల‌క్ష్యం అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.