రాష్ట్రంలో టెట్ ప్రాథ‌మిక ‘కీ’ విడుద‌ల‌

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్‌) ప్రాథ‌మిక ‘కీ’ విడుద‌లైంది. అభ్య‌ర్థులు tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో కీని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని క‌న్వీన‌ర్ రాధారెడ్డి తెలిపారు. స‌మాధానాల‌పై అభ్యంత‌రాలుంటే జూన్ 18వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించాల‌ని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన టెట్ ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారు. పేప‌ర్‌-1 ప‌రీక్ష‌కు 3,18,506 (90.62%), పేప‌ర్‌-2 ప‌రీక్ష‌కు 2,51,070 (90.35%) మంది అభ్య‌ర్థులు హ‌జ‌రయ్యారు. జూన్ 27వ తేదీన టెట్ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.