AP: టెన్త్ విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు

అమరావతి (CLiC2NEWS): ఎపిలో పదోతరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్ రాసుకొనేందుకు అవకాశం కల్పించారు. సబ్జెక్టుకు రూ. 500 ఫీజుతో పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలు రాసిన వారికి మాత్రమే బెటర్‌మెంట్ రాసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.