టిఆర్ ఎస్ కు విజయారెడ్డి రాజీనామా
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/vijayareddy.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రసమితి కార్పొరేటర్, పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి టిఆర్ ఎస్‌కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పంపారు. ప్రస్తుతం ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా విజయారెడ్డి ఉన్నారు. కాగా టిఆర్ ఎస్ లో తనకు సరైన అవకాశాలు రావడం లేదని.. తనను కేవలం డివిజన్ స్థాయికే పరిమితం చేశారని విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రసమితి కోసం అనేక త్యాగాలు చేసినట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం నిధులు లేక డివిజన్ ప్రజలు నిలదీస్తున్నారని వారికి సమాధానం చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు. ఇవాళ (శనివారం పిసిసి ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని మార్యాద పూర్వకంగా కలిశారు. పిజెఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విజయారెడ్డి వెల్లడించారు.