ప్ర‌భాస్ చిత్రంలో అమితాబ్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో తెలుగు సినిమా కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను ప‌తాక స్థాయికి తీసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం ట్విటర్‌లో ఓ బిగ్‌ సర్‌ప్రైజ్‌ షేర్‌ చేసింది. దిగ్గజ నటుడు అబితాబ్‌ బచ్చన్‌ తమ సినిమాలో నటిస్తున్నారని పేర్కొంది.

అయితే కొద్ది సేప‌టి క్రితం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్క‌నున్న క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషించ‌నున్నట్టు పేర్కొన్నారు. ప్ర‌ముఖ నటుడు లేకుండా ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఎలా చేస్తాం అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ద్వారా అమితాబ్ బ‌చ్చ‌న్ మూవీలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్‌ స్టార్స్ కాంబినేషన్‌లో మూవీ లవర్స్‌ కోసం ఎపిక్‌ మూవీని రూపొందించనున్నారు. యూనివర్సల్‌ అప్పీల్‌తో రూపొందబోయే ఈ భారీ బడ్జెట్‌ మల్టీ లింగ్వువల్‌ మూవీలో కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. 50 వసంతాలను పూర్తి చేసుకుంటున్న వైజయంతీ మూవీస్‌ సంస్థ తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన చిత్రాలను నిర్మించింది.

“స్వర్గీయ ఎన్టీఆర్‌గారికి అమితాబ్‌ బచ్చన్‌గారంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్‌ హిట్‌ రీమేక్స్‌లోనూ ఆయన నటించారు. రామకృష్ణ థియేటర్‌లో ‘షోలే’ మూవీ ప్రదర్శితమవుతున్నప్పుడు నేను, ఎన్టీఆర్‌గారు చాలాసార్లు, ఆ సినిమాను చూశాం. ఇన్నేళ్ల తర్వాత మా వైజయంతీ మూవీస్‌లో ప్రెస్టీజియస్‌గా రూపొందుతోన్న సినిమాలో అమితాబ్‌గారు నటిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది” అని అశ్వినీదత్‌ అన్నారు. “అమితాబ్‌ బచ్చన్‌గారు మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన పాత్ర సినిమా ఆసాంతం ఉంటుంది. ఆయనైతేనే ఆ పాత్రకు న్యాయం చేస్తారనిపించింది” అని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అన్నారు. 2022లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Leave A Reply

Your email address will not be published.