త‌మిళ యాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకున్న మ‌ధుశాలిని

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టి మ‌దుశాలిని పెళ్లి చేసుకున్నారు. త‌మిళ‌న‌టుడు గోకుల్ ఆనంద్ తో ఆమె వివాహం వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు హాజ‌రై నూత‌న వ‌దూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

వ‌రుత తెలుగు, త‌మిళ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మ‌దుశాలిని మొద‌ట్లో మోడ‌లింగ్‌, ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించారు. చిరంజీవి హీరోగా నటించిన `అంద‌రివాడు`లో న‌టిగా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌మైన మ‌ధుశాల‌ని త‌రువాత త‌మిళంలో వ‌రుస సినిమాలు చేశారు.

త‌న పెళ్లి విష‌యాన్ని మధుశాలిని స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. “మీరు చూపిన ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ‌బోతున్నాం“ అని ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.