TS: రాగల 5 రోజుల్లో భారీ వర్షాలు

హైదరాబాద్ (CLiC2NEWS): నైరుతీ రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ నెల 19న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 22వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సాధారణ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.