యాదాద్రీశురుడుకి బంగారు సింహాసనం..

యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి , అమ్మవార్లకు జరిగే నిత్యకల్యణోత్సవానికి బంగారు సింహాసనం సిద్ధమైంది. మండపంలో ఈ సింహాసనంపై ఉత్వవ విగ్రహాలను ప్రతిష్టించి నిత్యకల్యాణ క్రతువును వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దాదాపు రూ. 18 లక్షల వ్యయంతో బంగారు పూతతో తయారు చేసిన స్వర్ణ సింహాసనానికిక ఆదివారం ఆలయ ఈఓ పూజలు నిర్వహించారు. న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారతీయులు సామల, వీరమణి స్వామి దంపతులు స్వామివారికి కానుకగా అందిచినట్లు తెలిపారు.