బాస‌ర చ‌ర్చ‌లు సఫ‌లం

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్థామ‌ని ట్రిపుల్ ఐటి విద్యార్థుల‌కు మంత్రి స‌బిత హామీ

బాస‌ర (CLiC2NEWS): బాస‌ర ట్రిపుల్ ఐటి విద్యార్థుల‌తో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి జ‌రిపిన చర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి. సోమ‌వారం పొద్దుపోయిన త‌ర్వాత మంత్రి స‌బిత విద్యార్థుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. విద్యార్థుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్థామ‌ని హామీ ఇచ్చారు. చ‌ర్చ‌లు స‌ఫ‌లం అవ్వ‌డంతో మంగ‌ళ‌వారం నుంచి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు అవుతామ‌ని విద్యార్థులు తెలిపారు.

ట్రిపుల్ ఐటి క్యాంప‌స్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై అక్క‌డి విద్యార్థులు గ‌త ఆరు రోజులుగా ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎండ, వ‌ర్షం, చ‌లిని లెక్క చేయ‌కుండా విద్యార్థులు నిర‌స‌న తెలిపారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ విద్యా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సోమ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత దాదాపు 9.30కి నుంచి రెండు గంట‌ల పాటు విద్యార్థుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. మంత్రి విద్యార్థుల స‌మ‌స్య‌లు విని వాటిని ప‌రిష్క‌రిస్థామ‌ని తెలిపారు. అలాగే 15 రోజుల్లో మ‌రోసారి క్యాంప‌స్‌ను సంద‌ర్శిస్థాన‌ని విద్యార్థుల‌కు మంత్రి హామీ ఇచ్చారు. ఈ చ‌ర్చ‌ల్లో ట్రిపుల్ ఐటి డైరెక్ట‌ర్, నిర్మ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.