సికింద్రాబాద్ అల్ల‌ర్ల ఘ‌ట‌న‌లో మ‌రో ప‌ది మంది ఆరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌పై దాడి ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న 10 మందిని పోలీసులు ఆరెస్టు చేవారు. వారిని ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. గాంధీ ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం బోయ‌గూడ‌లోని రైల్వే కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర్చారు. వారికి రిమాండ్ విధించ‌డంతో నిందితుల‌ను చంచ‌లగూడ జైలుకి త‌ర‌లించారు. అరెస్టయిన 10 మందిలో ఐదుగురు వాట్స‌ప్ గ్రూప్ అడ్మిన్‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్ విధ్వంసం ఘ‌ట‌న‌లో కీల‌క భూమిక పోషించిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. మొద‌ట 45మందిని అరెస్టు చేశారు. వారిలో ఏ1గా మ‌ధుసూద‌న్‌ను గుర్తించారు. అత‌ను ఏ2గా పృథ్వీరాజ్‌తో క‌లిసి విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు ద‌ర్యాప్తులో గుర్తించారు.

వాట్స‌ప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో వంద‌ల మందిని స‌భ్యులుగా చేర్చి 17వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు రావాల‌ని ప్ర‌చారం చేశారు. శాంతియుతంగా నిర‌స‌న‌లు చేస్తే ఎలాంటి ఫ‌లితం ఉండ‌దని, రైల్వే బోగీల‌కు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టిస్తేనే కేంద్రం దృష్టికి వెళ్తుంద‌ని వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపించారు. వాట‌న్నింటినీ క్షుణ్ణంగా ప‌రిశీలించిన త‌ర్వాత పోలీసులు ఒక్కొక్క‌రిని ఆరెస్టు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో 55 మందిని అరెస్టు చేశారు.

అగ్నిప‌థ్: సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు

Leave A Reply

Your email address will not be published.