Afghanistan Earthquake: అఫ్ఘాన్‌కు భారత్ సాయం
న్యూఢిల్లీ (CLiC2NEWS): భారీ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్ఘానిస్థాన్‌కు భారత్ నుంచి మానవతా సాయం అందింది. గురువారం రాత్రి ఇండియా నుంచి విమానంలో భూకంప బాధితులకు అవసరమైన పరికరాలు, ఇతర సామాగ్రిని కాబుల్‌కు తరలించారు. ఈ విషయాన్ని స్వయంగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ట్విట్టర్ వేదిక తెలిపారు. ఆ ట్విట్టర్ పోస్టును విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ రీట్వీట్ చేశారు.
భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్ఘాన్‌కు ముందుగా సాయం పంపిన దేశం భారత్ కావడం విశేషం. సహాయ సామాగ్రితో పాటు ఒక సాంకేతిక బృందం కూడా కాబుల్‌కు వెళ్లింది. ఈ సాంకేతిక బృందం అక్కడ ఉన్న భారత దౌత్య కార్యాలయం నుంచి పనిచేయనుంది. భారత దౌత్య బృంద భద్రతకు తాలిబన్లు పలుమార్లు హామీలు ఇచ్చాక ఈ టెక్నికల్ టీమ్ అఫ్ఘానిస్థాన్ కు వెళ్లింది.
India, a true first responder. https://t.co/riXkZlzwxC
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 23, 2022