నామినేషన్ వేసిన ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్మూ..

ఢిల్లీ (CLiC2NEWS): రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్మూ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని ఒడిశా భవన్ నుండి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలల వద్ద నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, మంత్రులు రాజనాథ్ సింగ్ అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెసి నడ్డా అందరి సమక్షంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాని మోడీ వాటిని రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మూ పేరును మొదట ప్రధాని మోడీ ప్రతిపాదించగా.. ఆమె పేరును ప్రతిపాదిస్తూ 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు సంతకాలు చేశారు. ఎన్‌డిఎ ఎంపిలు, బిజెపి రాష్ట్రాల సిఎంలు, మరో 50 మంది ఎంపిలు ఆమెను బలపరిచారు.