బైక్‌పై వెళ్తుండ‌గా అన్న‌ద‌మ్ముల స‌జీవ‌ద‌హ‌నం

జంగారెడ్డిగూడెం (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్ద‌రు యువ‌కులు ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తుండ‌గా దారిలోనే స‌జీవద‌హ‌న‌మ‌య్యారు. జంగారెడ్డిగూడెం మండ‌లం దేవుల‌ప‌ల్లి గ్రామానికి చెందిన అన్న‌ద‌మ్ములు వ‌ల్లేప‌ల్లి నాగేంద్ర (21), ఫ‌ణీంద్ర‌(19) పాలు తెచ్చేందుకు పొలం వ‌ద్ద‌కు బైక్‌పై వెళ్లారు. మార్గ‌మ‌ధ్య‌లో 11కెవి విద్యుత్ వైరు తెగి బైక్‌పై ప‌డ‌టంతో మంట‌లు చెల‌రేగి వారిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే స‌జీవద‌హ‌న‌మ‌య్యారు. మ‌ర‌ణించిన వారిలో నాగేంద్ర ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. ఫ‌ణీంద్ర ఇంట‌ర్ సెకండియ‌ర్ పూర్తిచేశారు. చేతికి అందివ‌చ్చిన కొడుకులు చ‌నిపోవ‌డంతో తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

విద్యుత్ శాఖ నిర్ల‌క్ష్య‌మే ఈ ఘోరానికి కార‌ణ‌మ‌ని గ్రామ‌స్థులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల చొప్పున ప‌రిమారం అందించి..దీనికి కార‌ణ‌మైన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.