దేశంలో యాక్టివ్ కేసులు లక్షకుపైనే..
ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 16,103 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా క్రియాశాలక కేసుల సంఖ్య 1,11,711కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజులో 31 మంది కరోనాతో మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.27 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.21% నమోదైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 197.95 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేశారు. మరణించిన వారిలో ఎక్కువ కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఐదు, పశ్చిమబెంగాల్లో మూడు, ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మిజోరాంలలో రెండు చొప్పున మరణాలు నమోదయ్యాయి.