ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్‌లో మార్పులు
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/TS-inter-borad-copy-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సబ్జెక్టు సిలబస్‌లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఇంటర్ రెండో సంవత్సరానికి ఈ ఏడాది నుంచి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలు అందించనుంది. కొత్త సిలబస్‌తో ప్రచురించిన పుస్తకాలు త్వరలో బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. ఇటీవల ఇంగ్లిష్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారని జలీల్ స్పష్టం చేశారు.