హైదరాబాద్ లో కుండపోత..
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/rain-hyd.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. జంటనగరాల్లోని సికింద్రాబాద్, ఉప్పల్ ఎర్రగడ్డ, సనత్‌నగర్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అమీర్‌పేట్, అబిడ్స్, నాంపల్లి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, కోఠీ, నారాయణగూడ, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, హిమాయత్‌నగర్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహ్ ఎంసి అధికారులు సూచించారు. ఉపరిత ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.