సిఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ని ఆపొద్దు: మహారాష్ట్ర సిఎం షిండే
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/shinde.jpg)
ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్‌ని ఆపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ రోడ్లపై వెళ్తున్న క్రమంలో ప్రత్యేక ప్రొటోకాల్ ఏమీ పాటించాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తమది సామాన్యుల ప్రభుత్వమని.. విఐపిల కన్నా.. సామాన్య ప్రజానీకానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.