శ్రీలంక ప్రధాని పదవికి రాజీనామా.. పరారీలో అధ్యక్షుడు..!
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/vikram-singhe.jpg)
కొలంబో (CLiC2NEWS): శ్రీలంక ప్రధాని పదవికి రణిల్ విక్రమ సింఘే శనివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో శ్రీలంకలో రాజకీయ పార్టీల జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్నది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్షే తన అధికార నివాసం నుంచి పరారీ కావడం.. ఆందోళన కారులు అదికార కార్యాలయంలోకి దూసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి విక్రమ సింఘే రాజీనామా చేశారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమ సంఘే, గొటబాయలను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలో విక్ర సింగే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన రాజీనామాను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.