శ్రీలంకలో ప్రధాని ఇంటికి నిప్పు!
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/pm-house-fire-srilanka.jpg)
కొలంబో (CLiC2NEWS): శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో ప్రజల నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం అధ్యక్షు భవనంలోకి నిరసన కారులు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా నిరసన కారులు సాయంత్రం ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిప్పు అంటించారు. ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో ప్రధాని పదవికి రణిల్ రాజీనామా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం.