హైదరాబాద్లో సాయంత్రం భారీ వర్షం
![](https://clic2news.com/wp-content/uploads/2021/04/rain-hyd.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ముసురు కొనసాగనుంది. వాతావరణ శాఖ సూచనతో వర్షాకాల ప్రత్యేక బృందాలను జిహెచ్ ఎంసి అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవర పరిస్థితుల్లో ప్రజలు 040-09555500 హెల్ప్ లైన్ నంబరును సంప్రదించాలని సూచించారు. నగర వాసులు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. గత రెండు రోజుల్లో నగర వ్యాప్తంగా సగటున 8 సెం.మీ. వర్షం పాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం ఆదివారం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.