దేశంలో తాజాగా 18,257 కరోనా కేసులు
![](https://clic2news.com/wp-content/uploads/2022/01/covid-Test.jpg)
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా దేశంలో 18,257 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసులు 4,36,22,651 కి చేరాయి. వీటిలో 4,29,68,533 మంది బాధితులు వైరస్ నుండి కోలుకున్నారు.
గత 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా బారిన పడి 42 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 5,25,428 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 14,533 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,28,690 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.